ఇండియాలో భారీ పెట్టుబడులకు ప్లాన్స్ వేస్తున్న 8 అమెరికన్ కంపెనీలు ఇవే!

18-09-2015 Fri 13:38 | Business
అమెరికా నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ రెండోసారి ఆ దేశంలో పర్యటించనున్న వేళ, పలు కంపెనీలు ఇండియాలో భారీ పెట్టుబడులతో విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాయి. తమ కంపెనీల వృద్ధికి భారత మార్కెట్ అత్యంత కీలకమని ఈ కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణం. సిస్కో, గూగుల్ వంటి కంపెనీలు ఇండియాలో మరింతగా విస్తరించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పై కన్నేసిన టాప్ 8 కంపెనీల వివరాలు... గూగుల్: రూ. 1500 కోట్ల వ్యయంతో గూగుల్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ ను నిర్మించనుంది. అమెరికా తరువాత, గూగుల్ నిర్వహిస్తున్న సెంటర్లలో ఇదే అతిపెద్దది అవుతుందని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. సిస్కో: ఈ సంవత్సరంలో సుమారు రూ. 1300 కోట్లను పెట్టుబడిగా పెట్టిన సిస్కో, భారతీయులను మరింత టెక్ నైపుణ్యవంతులుగా చేసేలా శిక్షణా కార్యక్రమాల విస్తరణకు రూ. 360 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్: ఇండియాలో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రూ. 1,400 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఉబెర్ టెక్నాలజీస్: క్యాబ్ ఆధారిత టాక్సీ సేవలందిస్తున్న ఉబెర్ ఇప్పటికే 18 నగరాల్లో సేవలందిస్తుండగా, మరిన్ని నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రూ. 6,500 కోట్లను కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో తన అంతర్జాతీయ కార్యాలయాన్ని ఇండియాలో రూ. 310 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. జనరల్ మోటార్స్: ఇండియాలో కార్లను తయారు చేసి ఎగుమతులు చేస్తే, ఎక్కువ మార్జిన్లు పొందవచ్చని భావిస్తున్న జీఎం ఇండియా రూ. 6,400 కోట్లతో ప్లాంటును నిర్మించాలని ప్లాన్ వేసింది. ఈ ప్లాంటులో 12 వేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. హిల్లియార్డ్ ఎనర్జీ: సౌర, పవన విద్యుత్ సేవలందిస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 500 మెగావాట్ల సౌర, 150 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టనుంది. ఇందుకోసం రూ. 3,800 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. జాన్సన్ అండ్ జాన్సన్: బేబీ కేర్ ఉత్పత్తుల అగ్రగామిగా ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ రూ. 4 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇండియాలోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని తెలంగాణలో నిర్మించనుంది. సుమారు 48 ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంటు వచ్చే సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని, 1500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తారని సంస్థ చెబుతోంది. మార్స్: స్నిక్కర్స్, గెలాక్సీ వంటి బ్రాండ్ల పేరుతో చాక్లెట్లను విక్రయిస్తున్న మార్స్ సంస్థ పుణెలో రూ. 960 కోట్ల వ్యయంతో ప్లాంటును పెడుతున్నట్టు ప్రకటించింది. ఆ తరువాత ఇండియన్స్ కు చేరువైన పలు రకాల చాక్లెట్లను ఇక్కడే తయారు చేసి అందిస్తామని చెబుతోంది.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more